Published On: Tue, Oct 20th, 2020

తుపాకీ కాల్పుల కేసును చేధించిన పోలీసులు…

* ముగ్గురు నిందితులు అరెస్ట్‌

* లోతైన విచార‌ణ చేస్తున్న విజ‌య‌వాడ పోలీసులు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ శివారు ప్రాంత‌మైన నున్న బైపాస్ రోడ్డులో జరిగిన తుపాకీ కాల్పుల కేసును విజయవాడ పోలీసులు చేధించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో నున్న పోలీస్ స్టేషన్ పరిధి , శివారు బైపాస్ రోడ్డులో సుబ్బారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో గల ఖాళీ రోడ్డులో సి.పి.ఒ.లో ఉద్యోగి అయిన గజిగంటి మహేష్ (33) మరియు తన స్నేహితులు అయిన దినేష్ , హరికృష్ణ అను వారు మద్యం సేవించుచుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి అక్కడ నుండి హరికృష్ణ కారు అయిన ఎపి 16 సిడబ్యూ 4379 నెంబరు గల కారుతో రిపోయారు. తుపాకీ కాల్పులలో మహేష్ అక్కడికక్కడే బుల్లెట్స్ తగిలి మృతి చెందడం, హరికృష్ణకు పోట్టపై గాయం కావడం దినేష్ యొక్క సెల్ఫోన్ పగిలిపోయినట్లు వచ్చిన సమాచారం మేరకు వెంటనే సంఘటనా స్థలానికి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బ‌త్తిన శ్రీనివాసులు లా అండ్ ఆర్డర్ -2 డిసిపీ విక్రాంత్ పాటిల్ చేరుకుని అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విజయవాడ నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో మరియు నగరం నుండి బయటకు దారితీసే  అన్ని రహదారుల్లో నగర పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టడం నున్న శివారు ప్రాంతంలో రాత్రి సమయంలో తుపాకీతో హత్య చేసి కారుతో పారిపోయి సంచలనం కలిగించి సవాల్‌గా మారిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు నేరానికి పాల్పడిన నేరస్థులను త్వరితగతిన పట్టుకుని ఈ కేసును చేధించేందుకు ఆ ఆ ఆర్డర్ , సి.సి.ఎస్ .  మరియు టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది . అలాగే సంఘటన జరిగిన ప్రదేశంలో క్లూస్ విభాగాల ద్వారా వివరాలను సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి , ఈ కేసులో కాల్పులకు పాల్పడిన దుండగులు నేరం జరిగిన ప్రదేశం నుండి పారిపోతూ కారును తీసుకుని వెళ్ళి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గల ముస్తాబాద్ కు వెళ్లే మార్గం వద్ద కారును వదిలి పారిపోవడం జరిగింది . దర్యాప్తులో భాగంగా సంఘటన జరిగిన ప్రదేశం మరియు నిందితులు ప్రయాణించిన మార్గం పరిగనలోకి తీసుకుని ఆ ప్రాంతంలో గల సీసీ కెమేరా దృశ్యాలను పరిశీలించడంతో పాటు ఆధునిక సాంకేతిక  రిజ్ఞానాన్ని
ఉపయోగించడం ద్వారా తెలిసిన వ్యక్తుల పనా లేదా ఇంకెవరైనా దుండగులు చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించడం జరిగింది . విచారణలో భాగంగా నేరస్థలం వద్ద ఆటోలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన సున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించి మంగ‌ళ‌వారం శాంతినగర్ కు చెందిన ఆటో డ్రైవర్ రాధాకృష్ణా రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించి, మిగిలిన ఇద్దరు నిందితులు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చి , వీరు ముగ్గురూ నున్న మ్యాంగో మార్కెట్ వద్ద కలుసుకుని అక్కడ నుండి వేరే చోటుకు వెళ్తారనే సమాచారం మేరకు సాకేత్ రెడ్డి మరియు గంగాధలను అదుపులోకి తీసుకోవడం జరిగింది . సాకేశ్ రెడ్డి వద్ద నుండి మ్యాగజైన్‌తో కూడిన తుపాకీని, గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మ్యాగజైన్ మరియు రాధాకష్ణా రెడ్డి వద్ద నుండి ఆటోను స్వాధీనం చేసుకోవడం ప్రస్తుతం హైదరాబాద్లో కన్సల్టెంట్ మరియు ఇంటీరియర్ వర్కర్ గా పనిచేయుచున్నారు. ప్రస్తుతం సందీప్ పరారీలో ఉన్నాడు . అతని గురించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమైనది, ఈ సందర్భంగా తుపాకీ హత్య కేసును చేధించిన నున్న పోలీసులను మరియు సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ అభినందించడం జరిగింది. నిందితులు బిరం సాకర్ రెడ్డి (34) , స్వగ్రాము ఎస్.వి. వి . కాలనీ, కడ‌ప‌పు, జన గంగాధర్ (20), స్వగ్రామం ఏలూరు , ప్రస్తుతం హైదరాబాద్, నిజాంపేటలోని సర్ బస్ షో సొల్యూషన్స్ నందు సీనియర్ సేల్స్ రిక్రూటర్‌గా పనిచేయుచున్నాడు, ముదిరెడ్డి రాధాకృష్ణా రెడ్డి (50), శాంతినగర్, జయవాడ‌, వృత్తి అటో డ్రైవర్.
సంఘటన వివరాలు ఇవీ…
ఈ నెల 10వ తేదీన రాత్రి సమయంలో సున్న పోలీస్ స్టేషన్ పరిధి . దీవారు బైపాస్ రోడ్డులో గల సుబ్బారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో పై ముగ్గురు నిండితులు రాధాకృష్ణా రెడ్డి ఆటోలో కూర్చొని వారి వద్ద ఉన్న తెలంగాణ మద్యంను త్రాగుతుండగా సాకేట్ బెట్టి మరియు గంగాధర్‌ ఇద్దరు ద‌గ్గరలో గల ఖాళీ రోడ్డులో మద్యం తాగుతున్న మహేష్ మరియు అతని స్నేహితుల వద్దకు వెళ్ళి వాళ్ళలో ఎవడ్రా ఇక్కడ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు.  అని , వారి వద్ద గల కారులో ఎవరైనా మహిళ ఉన్నారేమో అని అనుమానించి , మహేష్ మరియు తన స్నేహితులను అడుగగా వెంటనే మహేష్ నేను పోలీస్ డిపార్ట్ మెంట్ అని గట్టిగా సమాధానం చెప్పడంతో, బాగా త్రాగిన మైకంలో ఉన్న ఇద్దరునిందితులలో సాకేత్ రెడ్డి అకస్మాత్తుగా తన వద్ద గల తుపాకీని బయటకు తీసి 9 రౌండ్సు కాల్పులు జరపడంలో మహేష్ క్రింద పడిపోయినాడు . ఆ కాల్పులలో దినేష్ ఫోన్ పగిలిపోగా హరికృష్ణకు మరియు నిందితుడు గంగాధర్‌లకు గాయాలు కాగా , నిందితులు అక్కడ నుండి హరికృష్ణ కారులో ముస్తాబాద్ రోడ్ వరకు వెళ్ళి అక్కడ కారును వదిలి పెట్టి , హైదరాబాద్ కు పారిపోయినారు . నిందితులు త్రాగిన మైకంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి , మహేష్ ను హత్య చేయడంజరిగింది . నిందితుడు సాకేత్ రెడ్డిని గతంలో హైదరాబాద్ నగరానికి చెందిన
ఒక హోటల్ యజమాని కొట్టినట్లు , దానితో అవమానం చెంది , రాజీవ్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో సాకేత్ రెడ్డి బీహార్ రాష్ట్రంలోని గయ అను ప్రాంతానికి ఆగస్టు నెలలో వెళ్ళి రూ. 15 వేలతో 7.65 ఎమ్. మ్. పిస్టల్ , రెండు మ్యాగజైన్లు మరియు 12 బుల్లెట్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడైనది. తదుపరి తెనాలి పట్టణానికి చెందిన సందీప్ గతంలో హైదరాబాద్ హాస్టల్ లో ఉండగా , పై నిందితులలో ఒకరైన సాకేత్ రెడ్డి పరిచయమై , తాను సెటిట్‌మెంట్స్ చేస్తాను , ఏమైనా ఉంటే చెప్పమని సందీప్ ను కోరినాడు .
అంతట సందీప్ విజయవాడ మధురానగర్ లో గల ఒక వ్యక్తిని బెదిరించాలని , అతని వల్ల తాను రూ .2 లక్షలు నష్టపోయానని మరియు తెనాలి పట్టణానికి చెందిన వెండి వ్యాపారి కొడుకును కిడ్నాప్ చేస్తే రూ.లు కోటి వస్తాయని చెప్పినాడు . అందుకు సాకేశ్ రెడ్డి ఒప్పుకుని , సెటిల్ మెంట్ మరియు కిడ్నాప్ చేయ్యడానికి గంగాధర్ ను తీసుకుని హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చి ఆటో డ్రైవర్లో కలిసి , త్రాగిన మైకంలో ఈ నేరానికి పాల్పడినట్లుగా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైంది . తదుపరి ఈ కేసులో ముద్దాయిలను పోలీస్ కస్టడీకి తీసుకుని మరే ఇతర కారణాలు మరియు వ్యక్తుల ప్రమేయం గురించి లోతైన దర్యాప్తు కొనసాగుతుంది.

 

Just In...