Published On: Tue, Oct 20th, 2020

11,981 మంది భక్తులకు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

* ఆదాయం రూ.14.54 ల‌క్ష‌లు

* నేడు తెల్ల‌వారుజాము 3నుండి రాత్రి 9 గంట‌ల‌ వరకు అమ్మవారి దర్శనానికి అనుమ‌తి

* వీఐపీల‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేత

* దుర్గ‌గుడి ఛైర్మన్, ఈవో వెల్ల‌డి

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజున‌ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను  మంగళవారం ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటలు వరకు 11,981మంది భక్తులు దర్శించుకున్నారని దేవస్థానం ఛైర్మన్ పైలా  సోమినాయుడు, ఆలయ కార్య నిర్వాహణాధికారి యంవి. సురేష్‌బాబు తెలిపారు. ఇంద్ర‌కీలాద్రిపై మీడియా పాయింట్ వ‌ద్ద వారు మాట్లాడారు. రూ.500, రూ.300,రూ.100 టిక్కెట్లు, లడ్డు విక్ర‌యాలు, చీర‌ల వేలంపాట కింద రూ.14,54,345లు దేవస్థానానికి ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. అలాగే లక్ష కుంకుమార్చనకు 35మంది, చండీ హోమానికి 11 మంది, శ్రీచక్రనవవర్ణార్ఛనకు ఒక్కరు చొప్పున ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా అమ్మవారి ప్రత్యేక సేవలను పరోక్షంగా ఏకాంతంగానే నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. బుధవారం మూలానక్షత్రం సంద‌ర్భంగా మధ్యాహ్నం 3 నుండి 4 గంటలు మద్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి దర్శనం చేసుకుంటారని వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు తీసుకున్న భక్తులకు స్లాట్ బుకింగ్ సమయాల్లో కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా దర్శనాలు కల్పిస్తామని, ద‌ర్శనానికి వచ్చే భక్తులను నిరాశ పర్చకుండా ఆన్‌లైన్ స్లాట్లలో ఖాళీగా ఉన్నవాటిని కరెంటు బుకింగ్ ద్వారా కేటాయిస్తామ‌న్నారు. మూలా నక్షత్రం సంద‌ర్భంగా వీఐపీలకు దర్శనాలను నిలిపివేస్తామ‌న్నారు. వారికి కేటాయించిన వాహనాల‌ను ఇంద్రకీలాద్రిపైకి  అనుమతించ‌మన్నారు. క‌మిటీ సభ్యులు కె.వెంకటరమణ తదితరులు  ల్గొన్నారు.

Just In...