Published On: Sat, Oct 24th, 2020

సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి

* సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ప్రభుత్వం డీఏల చెల్లింపున‌కు ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వాయిదా పడ్డ జీతాలను కూడా నవంబర్ 1 నుంచి చెల్లించనున్నారు అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అంటూ ప్రశంసించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న సరే సీఎం జగన్ఉ ద్యోగులకు మేలు చేయడం ఆనందంగా ఉంది అన్నారు రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వాయిదా పడ్డ జీతాలను, పెండింగ్ డీఏలను చెల్లించేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్నారు.

రెండు డిఏలు పెండింగ్ జీతాలకు సీఎం అంగీకారం…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండు విడతలు డిఏలు చెల్లింపునకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంగీకరించినట్లు రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి,  బండి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏపీఎన్జీవో సంఘ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఈ మేరకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారని, వారికి కావాల్సిన  సౌకర్యాలను ప్రయోజనాలను తాము తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నట్లు ఎన్జీవో సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగులను డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌కు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.  రెండు డిఎలను నవంబరులోనే చెల్లించనున్నట్లు తెలిపారు.

Just In...