Published On: Mon, Nov 16th, 2020

బుడమేరులో దూకిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

* అభినందించిన పోలీసు అధికారులు, ప్ర‌జ‌లు

విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: బుడమేరులో దూకి కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ సాహ‌సం చేసి ప్రాణాలు కాపాడారు. అజిత్‌సింగ్‌నగర్ బుడమేరు వంతెనపై నుండి శుక్ర‌వారం ఓ వ్యక్తి కాల్వ‌లో దూకగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న బుజ్జిబాబు (హెచ్‌సి నెంబర్ 488) హెడ్ కానిస్టేబుల్ వెంటనే స్పందించి కాల్వలో దూకి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఈ సంద‌ర్భంగా హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబును పోలీసు ఉన్న‌తాధికారుల‌, స్థానికులు అభినందించారు. గ‌తంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ వృద్దురాలు కాల్వలో దూకగా హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న కాల్వలోకి దూకి ఆమే ప్రాణాలు కాపాడారు. ప్ర‌స్తుతం బుజ్జిబాబు అజిత్‌సింగ్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

 

Just In...