Published On: Thu, Nov 19th, 2020

స‌న్‌రైజ్ ఆసుప‌‌త్రిలో అతి క్లిష్ల‌మైన స‌ర్జ‌రి విజ‌య‌వంతం‌

* వైద్య బృందాన్ని అభినందించిన మేనేజింగ్ డైరెక్ట‌ర్లు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: న‌గ‌రంలోని స‌న్‌రైజ్ ఆసుప‌త్రిలో అతి క్లిష్ట‌మైన శ‌స్త్ర చికిత్స‌ను ఎండోస్కోపి ద్వారా విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు ఆసుప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్లు డాక్ట‌ర్ ఎం.న‌రేంద్ర‌కుమార్‌, ఎం.వి.సాయికృష్ణ తెలిపారు. విజ‌య‌వాడ‌ పుష్పా హోట‌ల్ స‌మీపంలోని స‌న్‌రైజ్ ఆసుప‌త్రిలో గురువారం సాయ‌త్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ శ‌స్త్ర చికిత్స వివ‌రాల‌ను తెలియ‌జేశారు. కృష్ణా జిల్లా, మూలపాడు గ్రామానికి చెందిన బి.రామకృష్ణ (44) తన ఇంటి బయట బాత్రూంకు వెళ్లే దారిలో కాలు జారి పడిన సమయంలో ప్రక్కనే ఉన్న ఇనుపరాడ్డుపై పడ్డారు. దాంతో ఇనుపరాడ్డు రామ‌కృష్ణ మెడలో కుడివైపు నుండి గుచ్చుకుని అవతల వైపు చెవిలో నుండి బయుటకు వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు దీన్ని గమనించి, ఆ రాడ్డును స్తంభం నుంచి కత్తిరించి, ఆయనను దగ్గరలో పలువురు వైద్యులు వద్దకు తీసుకువెళ్ళగా, పరిస్థితి తీవ్రత దృష్టా విజయవాడలో సన్‌రైజ్ హాస్పటల్‌కు తీసుకు వెళ్ళాల‌ని సదరు వైద్యులు సూచించారు. సన్‌రైజ్ హాస్పటల్‌లో డాక్ట‌ర్ నరేంద్రకుమార్‌, చెవి, ముక్కు, గొంతు వైద్యులు ఎన్‌.విద్యాసాగ‌ర్‌, మ‌త్తు డాక్ట‌ర్ కిషోర్‌లు రోగిని పరీక్షించి, అవసరమైన త్రీడీ సిటీస్కాన్‌, ర‌క్త ప‌రీక్ష‌లు చేసి ఇనుపరాడ్డు మెదడుకు వెళ్ళే పెద్ద రక్తనాళం మరియు ముఖ్యమైన నరాల‌కు అతి దగ్గరలో ఉందని గుర్తించారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా పరిగణించి, అత్యవసర శస్త్రచికిత్స చేయాల‌ని నిర్ణయించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో వైద్యులు విద్యాసాగర్, లవణ్‌కుమార్, కిషోర్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఐదు గంట‌లు పాటు శ్రమించి అతి కష్టం మీద పేషంట్ రామ‌కృష్ణ‌కు శస్త్ర చికిత్సను వైద్య బృందం స‌హ‌కారంతో విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని పేర్కొ‌న్నారు. సాధార‌ణంగా ఆపరేషన్ మెడను రెండు వైపులా పూర్తిగా ఓపెన్ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. కానీ.. రామ‌కృష్ణ‌కు ఆ అవ‌స‌రం లేకుండానే కేవ‌లం ఎండోస్కోపి ద్వారా అత్యాధునిక అత్యంత జాగ్రత్తగా మెదడుకు వెళ్ళే ర‌క్త‌నాళం భ‌ద్ర‌ప‌ర‌చి దానికి ఎటువంటి ప్రమాదం జ‌ర‌గ‌కుండా ఇనుపరాడ్డును తొల‌గించి పేషంట్ రామ‌కృష్ణ‌ను కాపాడామ‌ని పేర్కొన్నారు. పేషెంట్ యొక్క ఎడమవైపు ఫేసియ‌ల్ నెర్వ్‌, స్వరపేటిక, అన్నవాహిక నరాల‌ను గాయపరచటం జరిగింద‌న్నారు. ఎండోస్కోపి చేసి పరీక్షించగా స్వరపేటిక మరియు అన్నవాహిక ద్వారం పనిచేయడం లేద‌ని గుర్తించి వాటికి త‌గిన విధంగా సర్జరీ నిర్వ‌హించి స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో అన్ని అవ‌య‌వాలు ప‌నిచేసే విధంగా వైద్య బృందం కృషి చేశార‌ని తెలిపారు. పేషెంటును ఐసీయూలో ఉంచి తదుపరి చికిత్సను అందించామ‌ని తెలిపారు. వైద్య బృందం స‌కాలంలో చికిత్స అందదించి రామ‌కృష్ణ ప్రాణాలు కాపాడామని పేర్కొ‌న్నారు. ప్రస్తుతం పేషంట్ రామ‌కృష్ణ ఆరోగ్యం
నిలకడగా ఉంద‌ని, మిగిలిన సమస్యలను సమయానుసారంగా పేషెంట్‌ను పరీక్షించి వాటికి చికిత్స అందించాల్సి ఉంద‌న్నారు. విలేక‌రుల స‌మావేశంలో ఆసుప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సాయికృష్ణ, వైద్యులు విద్యాసాగర్, లవణ్‌కుమార్, కిషోర్ సాయిచందర్ పాల్గొన్నారు.

 

Just In...