నిత్యాన్నదాన ఫధకానికి లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి విశాఖపట్నం చిన్న అమ్మవారి వీధికి చెందిన కె.రాంబాబు కుటుంబసభ్యులతో కలిసి రూ.1,01,116 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబును కలిసి విరాళం చెక్కును అందించి కె.వెంకట సీతారాం, కల్యాణి పేర్ల మీద అన్నదానం జరపాలని కోరారు. ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.