Published On: Wed, Dec 2nd, 2020

బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

* చనిపోయిన వారికి ఇప్పటికే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం

* దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం పలు కార్యక్రమాలు

* వ్యవసాయ రంగంపై చర్చకు సమాధానంలో సీఎం జగన్

* శాసనసభ శీతాకాల సమావేశాల్లో తొలి రోజు ప్రసంగం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సభలో తొలిరోజున చర్చ అనంతరం సవివరంగా సమాధానం ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్, రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు డ్రామా, ఎల్లో మీడియా డైరెక్షన్.  కాసేపటి క్రితం పెద్ద డ్రామా మన కళ్లతో మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారు యాక్టర్‌ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా కధ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ఎలాగూ దీనిపై ఇవాళ సభలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తోంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టం అవుతుంది అనే ఒక దుర్భుద్ధితో ఒక డ్రామా. ఈయనంత ఆయనే ఎందుకు రెచ్చిపోయాడో తెలియదు. వారి పార్టీ మనిషే మాట్లాడుతున్నాడు. రామానాయుడు మాట్లాడుతున్నాడు. దానికి క్లారిఫికేషన్‌ ఇచ్చాం. దానికి ఆయన తిరిగి మాట్లాడాలి. ముందుకు సాగాలి. కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకున్నాను. సడెన్‌గా లేచి నేను మాట్లాడతానని అన్నాడు. ఒక టాపిక్‌ అనేది ఎప్పుడు కూడా ఒక పద్దతి ప్రకారం పోతుంది. అంతే కానీ క్లారిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత మళ్లీ అందుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. అది ఆయనకూ తెలుసు. తెలిసినా వెంటనే రెచ్చిపోవడం. అసలు ఆశ్చర్యకరం. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడూ పోడియమ్‌లోకి రాలేదు. దటీజ్‌ ది డీసెన్సీ ఎనీ బడీ ఫాలోస్‌. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయనే పోడియమ్‌లోకి రావడం, వచ్చిన వెంటనే అందరినీ నెట్టేసి కూర్చోవడం.  ఆ తర్వాత పక్క నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 స్క్రీన్‌ప్లే ప్రకారం దాని ఎత్తుకోవడం, దాన్ని రేపు పొద్దున పేపర్లలో రాయడం. రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? రైతులకు ఏ రకంగా దీని వల్ల మంచి జరుగుతుంది అన్నది రేపు పొద్దున హెడ్డింగ్స్‌ ఉండవు. చంద్రబాబు అనే వ్యక్తి ఫ్లోర్‌ మీద కూర్చోవడం. మార్షల్స్‌ ఎత్తుకోవడం, అవే హెడ్డింగ్‌లు. మా ఖర్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థను ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నాడు అంటే, నిజంగా షేమ్‌. ఇక రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఒక అనుకోని పరిస్థితి వచ్చింది. క్యాబినెట్‌లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ కూడా జరుగుతోంది. దీని మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఆ మాటల వల్ల తమకు ఏమైనా మంచి జరుగుతుందా? అన్న మాటలు వినడానికి చాలా మంది ఆరాటపడుతున్నారు. అటువంటివన్నీ కూడా కనిపించకూడదు. వినిపించకూడదు అని చెప్పి రాజకీయాలు చూస్తున్నాం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యింది. ఇది మాకు రెండో నవంబరు మాసం. ఈ నవంబరు చివరి నాటికి రాష్ట్రంలోని ఏ రిజర్వాయర్‌ తీసుకున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని రిజర్వాయర్లు ఇప్పుడు నీటితో  కళకళలాడుతున్నాయి. గత పదేళ్లలో ఏనాడూ లేనంతగా భూగర్భ జలాలు రీఛార్జ్‌ అయ్యాయి.  అయితే దురదష్టవశాత్తూ దీపం వెలుగు కింద చీకటి ఉన్నట్లు ఆగస్టు నుంచి నవంబరు వరకు అడపా దడపా కురిసిన వర్షాల వల్ల మన రైతులకు కొంత నష్టం కలిగింది. ఆ నష్టం జరిగినప్పుడు వెంటనే నిజాయితీగా సమీక్షించాను. వెంటనే ఆ సీజన్‌కు సంబంధించిన పంట నష్టం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. అటువంటిది మనసున్న ప్రభుత్వంగా, రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా, రైతులకు తోడుగా ఉండేందుకు మన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగులు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షం విమర్శిస్తుందనో చేయలేదు. పత్రికల్లో రాశారనో ఈ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. రైతులకు–నాకు మధ్య ఉన్న బలమైన ఆత్మీయ అనుబంధంతోనే, రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా తెలియజేస్తూ, ఈ విషయాలు చెబుతున్నాను.
ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఆ నష్టం వర్షాల వల్ల కావచ్చు, తుపాను వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు.. కారణం ఏదైనా ప్రకతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో నష్ట పరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే ప్రథమం. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాలా రూ.143 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత మొత్తంతో గత అక్టోబరు 27న ఇవ్వడం జరిగింది. అక్టోబరు నెలలో వచ్చిన అ«ధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నవంబరు 17న ఒక నెల కూడా తిరక్క ముందే రూ.132 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించాం. మళ్లీ నవంబరులో నివర్‌ తుపాను వల్ల పంటలకు, ఇళ్లకు, రోడ్లకు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే చాలా వాటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరింత వివరంగా.. భారీ వర్షాలతో సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. చిన్న వారు కావొచ్చు, పెద్ద వారు కావొచ్చు. అవ్వలు కావొచ్చు. తాతలు కావొచ్చు.
చివరకు 3 ఏళ్ల పిల్లవాడు లేదా సంత్సరం పిల్లవాడు కూడా కావొచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి రూ.500 చొప్పున ఎంత మంది అయితే సహాయ శిబిరాల్లో ఉంటారో వారందరికీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక ఇంటిలో దాదాపు నలుగురు ఉంటారు. ఆ విధంగా ప్రతి ఇంటికి దాదాపు రూ.2 వేలు ఇచ్చినట్లు అవుతుంది. ఎవరైతే నీళ్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో. వారిని శిబిరాలకు తరలించడమే కాకుండా, అక్కడ వారిని అన్ని రకాలుగా చూసుకోవడమే కాకుండా, వారిని ఇంటికి పంపించేటప్పుడు, ఇళ్లకు వచ్చిన తర్వాత మళ్లీ ఇబ్బంది పడకుండా మనిషికి రూ.500 చొప్పున, ఒక ఇంట్లో ఉజ్జాయింపుగా నలుగురు ఉంటారనుకుంటే మొత్తం రూ.2 వేలు చేతిలో పెట్టి పంపడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు వచ్చే సరికే శిబిరాల నుంచి తిరిగి ఇళ్లలోకి వెళ్లిన వారందరి ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇస్తామని నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.
పంట ఇతర నష్టాలపై..:
ఇదే కాకుండా పంట నష్టాలన్నింటినీ డిసెంబరు 15 నాటికి మదింపు చేసి, పరిహారాన్ని డిసెంబరు 31లోగా రైతులకు  ఇవ్వబోతున్నాం. ఇది కూడా కరెక్టుగా చూస్తే నెలలోపే. ఇది చూసినప్పుడు నిజంగా ఇది ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ డబ్బు కూడా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదొక్కటే కాకుండా, మళ్లీ పంట వేయడానికి కావాల్సిన విత్తనాలను రైతులకు 80 శాతం సబ్సిడీ మీద అందించడం జరుగుతోంది. ఆ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇళ్లకు జరిగిన నష్టానికి, పశువులు, కోళ్లు నష్టపోయిన వారికి, పడవలు, వలలు నష్టపోయిన వారి అంచనాలు కూడా డిసెంబరు 15 లోగా పూర్తి చేసి, డిసెంబరు 31లోగా పరిహారం కూడా ఇవ్వబోతున్నాం. తుపాను వల్ల అనుకోకుండా 8 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని చెప్పి, వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేశాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, చెరువులకు జరిగిన నష్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అంచనా వేసి, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్‌ సరఫరా నిల్చిపోయిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడంతో దాదాపు అన్ని చోట్ల విద్యుత్‌ పునరుద్ధరణ జరిగింది. మిగిలిన చోట్ల కూడా రెండు, మూడు రోజుల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది.

ధాన్యం కొనుగోలు:
ఇంకా ఈ వర్షాల వల్ల రాయలసీమ జిల్లాలే కాకుండా, ఈ పక్క కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో కూడా పంటలు దెబ్బ తిన్నాయి. పంటలు నీట మునిగాయి. ధాన్యం రంగు మారింది. ఇంకా కొన్ని చోట్ల ధాన్యం మొలకలెత్తి కొందరు రైతులు అవస్థలు పడడం కూడా కనిపించింది. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఒక గొప్ప ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప, ఎప్పుడూ కూడా ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అటువంటిది రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో మొలకెత్తిన ధాన్యం కొనుగోలు ఎప్పుడూ
జరగలేదు. ధాన్యం మొలకెత్తిన రైతులకు కూడా న్యాయం చేసేందుకు గ్రేడెడ్‌ ఎమ్మెస్పీతో ఒక బ్రాకెట్‌ కింద తీసుకువచ్చి ఆ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రైతులను కూడా ఆదుకోవాలి. వారికి కూడా మంచి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ–క్రాపింగ్‌ డేటా ఆధారంగా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి కూడా గ్రీన్‌
సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది.
ఇన్సూరెన్సు కూడా ఇప్పుడు మన ప్రభుత్వమే బాధ్యతగా ఈ ఖరీఫ్‌ అంటే, 2020 ఖరీఫ్‌ నుంచి ఇన్సూరెన్సు బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే ఇన్సూరెన్సు కంపనీలు బాధ్యత తీసుకోవడం లేదు. అవి స్పందించే తీరు మానవత్వంతో ఉండడం లేదు. సమయానికి స్పందించడం లేదు. 2012కి  సంబంధించిన క్లెయిమ్‌లు మన ప్రభుత్వం వచ్చాక కట్టి, క్లెయిమ్‌లకు వెళ్లడం. ప్రీమియమ్‌ ఎక్కువగా ఉండడంతో రైతులు పంటలకు ఇన్సూరెన్సు చేయకపోవడం చూశాం. దాని వల్ల పంట నష్టం పరిహారం రాకుండా పోయే పరిస్థితి రావడం గతంలో ఎక్కడా చూడడం జరగలేదు.  అందుకే ఈ ఏడాది, 2020 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఇన్సూరెన్సు
బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడం జరుగుతోంది. అలా తీసుకుంటా ఉంది కాబట్టి, ఇప్పటి నుంచి జనవరి చివరి వరకు క్రాప్‌ కట్టింగ్‌ జరుగుతుంది కాబట్టి, దాన్ని బట్టి రైతులు ఎంత నష్టపోయారన్నది చూసి, ఫిబ్రవరిలో ప్రణాళిక శాక నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు మార్చి, ఏప్రిల్‌లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్‌ కూడా సెటిల్‌ చేస్తామని చెబుతున్నాను. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు.  క్రాప్‌ కటింగ్‌ పూర్తైన తర్వాత నెల, రెండు నెలల్లోనే ఇన్సూరెన్సు క్లెయిమ్‌ అన్నది చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదని చెబుతున్నాను.  వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కానీ, ప్రజలకు కానీ, అదే సీజన్‌లో (నివర్‌ తుపాను విషయంలో అయితే కేవలం నెల లోపల) పరిహారం, సబ్సిడీ వంటివి ఇవ్వడం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.

గతంలో దారుణ పరిస్థితి..
గతంలో ఎలా జరిగింది అన్నది కూడా ఒక్కసారి టేబుళ్లలో (పట్టికల్లో) చూడండి. ఉదా: ఇన్‌పుట్‌ సబ్సిడీ అనేది గతంలో ఎలా జరిగేది అనేది చూస్తే, 2014 ఖరీఫ్‌లో నష్టం జరిగితే, ఆ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎప్పుడు వచ్చింది అని చూస్తే, జూలై 22, 2015న రూ.692 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరో విడత 2017లో ఇచ్చారు. అలా ఎంత ఆలస్యం చేశారని చూస్తే, 2014 ఖరీఫ్‌ నష్టానికి పరిహారం రెండున్నర ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2015 ఖరీఫ్‌ నష్టం ఒక ఏడాది ఆలస్యంగా 2016 నవంబరులోనూ, అదే సీజన్‌ ఉద్యాన పంటలకు సంబంధించిన నష్టానికి పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2017 మే నెలలో ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టానికి తొలి విడత పరిహారం ఏడాది ఆలస్యంగా, అంటే 2017లో ఇవ్వగా, మిగిలిన పరిహారం రెండేళ్లు ఆలస్యంగా 2018లో ఇచ్చారు. 2017 రబీ నష్టం పరిహారం కూడా ఏడాది ఆలస్యంగా ఇచ్చారు. ఇవి కాక 2018 ఇన్‌పుట్‌ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టేశారు. రైతులకు ఏమీ ఇవ్వలేదు. 2018 ఖరీఫ్‌లో రూ.1838 కోట్లు, అదే ఏడాది రబీలో రూ.356 కోట్లు.. మొత్తంగా రూ.2194 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. అసలు ఏమీ ఇవ్వలేదు.

 

Just In...