Published On: Sat, Jan 9th, 2021

జీవవైవిద్యాన్ని కాపాడుకుందాం…

* మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: జీవవైవిద్య పరీరక్షణ చట్టం 2002ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర విద్యుత్తు, అటవీ పర్యావరణ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. విజయవాడలోని ఓ హోట‌ల్‌లో శ‌నివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో జీవవైవిధ్య సంరక్షణ చట్టం- 2002పై ఏర్పాటు చేసిన అవగహన సదస్సును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌జ‌ల జీవనాడి అయిన జీవవైవిద్యాన్ని కాపాడుకోవాలని అందుకు ఏర్పాటు చేసిన చట్టాన్ని ప్రజలందరికి తెలిసేలా చేయాలన్నారు. చ‌ట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాల్ని చేపట్టామని అందులో భాగంగా జీవవైవిధ్య ప్రాముఖ్యతపై గోడ క్యాలెండరు, టేబుల్ క్యాలెండర్‌ను ముద్రించి రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలు, వార్డు, సచివాలయాలకు పంపేందుకు పంచాయితీరాజ్ శాఖ ద్వారా ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. వీటి ద్వారా సమాచారాన్ని గ్రామ ప్రజలు తెలుసుకుని తద్వారా అవగాహన తెచ్చేందుకు వీలుంటుంద‌న్నారు. ఆ రెండు క్యాలెండర్లను, వీడియోలను మంత్రి ఈ సంద‌ర్భంగా విడుదల చేశారు. రాష్ట్రంలో 14207 జీవవైవిద్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఇంటింటికి ఔషద మొక్కలతోట అనే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జీవ వైవిద్య మండలి సభ్య కార్యదర్శి నళినిమోహన్ తన ప్రజంటేషన్‌లో వివరించారు. అందులో భాగంగా ఒక్కో జిల్లాలో వంద గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాల్టీలలో 1500 కుటుంబాలకు ఈ పథకం కింద మొక్కలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టతున్నట్లు నళిని మోహన్ చెప్పారు. ఐక్యరాజ
సమితి ప్రతిపాధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎడిజి)ను మరింతగా ప్రచారం చేస్తున్నామన్నారు. జీవవైవిధ్య మండలి చేపట్టిన కార్యక్రమాలను ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులుచ‌ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాష్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ‌గోదావ‌రి జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Just In...