రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీసీ
* కోవిడ్ నివారణ చర్యలను వివరించిన ఏపి సీఎం జగన్
అమరావతి, సెల్ఐటి న్యూస్: దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ నేపధ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. కోవిడ్ నివారణతో పాటు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ ప్రధానికి వివరించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.