Published On: Tue, Jan 12th, 2021

కోడి క‌త్తులు విక్ర‌యిస్తున్న నిందితుడు అరెస్టు

* 700 కోడి కత్తులు, కత్తులు సానబట్టే యంత్రం, పనిముట్లు స్వాధీనం

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ళకు కట్టే కత్తులను తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడిని విజయవాడ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమ‌వారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా నిందితుడి వ‌ద్ద నుంచి 700 కోడి కత్తులు, కత్తులు సానబట్టే యంత్రం, వాటి పనిముట్లు స్వాధీనం చేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాలపై నగర పోలీసులు కత్తులు కట్టి కోడి పందేలు ఆడేవారు/ఆడించే వారి మీద, కత్తులు కట్టే వారి మీద, కత్తులు తయారీదారులపై మరియు బెట్టింగ్ పై పేకాట, కోతముక్క తదితర జూదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేకంగా అదనపు పోలీసు బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఉత్సాహంగా, ఆనందంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా శాంతియుత వాతావరణంలో చట్ట పరిధిలో జరుపుకునేందుకు నగర పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంద‌ని తెలిపారు. ఈ నేపథ్యంలో విజ‌య‌వాడ సీపీ శ్రీనివాసులుకి అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపిలు జి.వి.రమణమూర్తి, విఎస్‌ఎన్ వర్మ సూచన ప్రకారం సిటిఎఫ్ ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్, ఎస్‌ఐ బి.రవితేజ, సిటిఎఫ్ సిబ్బందితో సోమ‌వారం ఉంగుటూరు మండలం తెంపల్లి గ్రామంలో ఒక వ్యక్తి వద్ద నుండి 700 కోడి కత్తులు, కత్తులు పదును పెట్టే యంత్రం మరియు వాటి పనిముట్లు స్వాధీనం చేసుకోవడం అరెస్ట్ చేసిన నిందితుడు ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామం, రైల్ గేట్ బజార్‌కు చెందిన కాళిదాసు జమలయ్య (49) అని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు కోడి పందేలకు వినియోగించే కత్తులు తయారు చేసి విక్రయిస్తున్న‌ట్లు నేరాన్ని అంగీక‌రించాడు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితుడిని ఆత్కూరు పోలీసుల‌కు అప్పగించారు. 

Just In...