తుర్లపాటి మృతి పాత్రికేయ, సాహితీ రంగానికి తీరని లోటు
* ఎంపీ కేశినేని నాని
విజయవాడ, సెల్ఐటి న్యూస్: పద్మశ్రీ పురస్కార గ్రహీత తుర్లపాటి కుటుంబరావు మృతి పాత్రికేయ, సాహితీ రంగానికి తీరని లోటు అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. సీనియర్ జర్నలిస్ట్, సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు (89) మృతి పట్ల ఎంపీ కేశినేని నాని తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాచవరంలోని శిఖామణి సెంటర్లో ఉన్న ఆయన స్వగృహంలో తుర్లపాటి పార్థివ దేహాన్ని ఎంపీ కేశినేని నాని సోమవారం సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా తుర్లపాటి కుటుంబరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని
తెలియజేశారు. ఎంపీ నాని వెంట మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు తెదేపా నేతలు ఉన్నారు.