Published On: Thu, Jan 14th, 2021

నిజాయితీపరుల‌ను ప్రజలు ఆశీర్వదించాలి

* జ‌న‌సేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్

* షేక్ గ‌యసుద్దిన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక పంపిణీ

భ‌వానీపురం(విజ‌య‌వాడ‌), సెల్ఐటి న్యూస్‌: జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ గ‌యసుద్దిన్ ఆధ్వర్యంలో బుధ‌వారం ఉద‌యం భవానిపురం బ్యాంక్ సెంటర్‌లో రెండు వేల మందికి సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ‌న‌సేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యువ కార్పొరేటర్ అభ్యర్థిగా గ‌యసుద్దిన్ ప్రజలతో మమేకమై ప్రజల కోసం నిత్యం పని చేస్తున్నారని ప్రజలు ఆనందంగా పండుగ చేసుకోవాలన్నారు. గతంలో రంజాన్ క్రిస్మస్‌తో పాటు నేడు సంక్రాంతి కానుకను పంపిణీ చేస్తున్న గ‌య‌సుద్దిన్ మంచి మనసున్న మానవతావాది అని ఇటువంటి యువకులను కార్పొరేషన్‌కి పంపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీగా ప్రజా సేవ చేస్తారని అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోతిన మహేష్ మాట్లాడుతూ జగన్‌కి ఒక అవకాశం ఇస్తే మంచి సీఎంగా నిరూపించుకుంటామని ప్రచారం చేసుకొని నేడు రాష్ట్రానికి ముంచే సీఎంగా తయారయ్యారని, జగన్ కుత్రిమ కొరత సృష్టించి ఇసుక కూడా దొరకకుండా చేసి కోటి మందికి ఉపాధి కోల్పోయేలా చేయ‌డం వ‌ల్ల నేడు రాష్ట్రంలో పండగ చేసుకునే పరిస్థితులు సామాన్య మధ్యతరగతి ప్రజలకు లేవన్నారు. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అటకెక్కాయి అని ఎద్దేవా చేస్తూ దేవాదాయ శాఖ మంత్రికి అవినీతి మీద ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదని వారినే కార్పొరేటర్ అభ్యర్థులు కూడా అనుసరిస్తున్నారని విమ‌ర్శించారు. ఐజాక్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలతో మమేకమై కుల‌మతాలకు అతీతంగా పనిచేస్తున్న యువకుడు అని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఠాగూర్ పద్మావతి, 42వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తిరుపతి అనూష, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు‌.

Just In...