Published On: Thu, Jan 14th, 2021

రైతుల ప‌ట్ల కేంద్రం వైఖ‌రి అమానుషం…

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

* భోగి మంటల్లో చ‌ట్ట ప్ర‌తులు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపుదల జివోల ప్రతులను రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో సిపిజ శ్రేణులు భోగి మంటల్లో వేసి దగ్గం చేయడం జరిగింది. అనంతపురంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్, సహాయ కార్యదర్శి జాఫర్లతో సహా సిపిజ(ఎం) నేతలను కూడా పోలీసులు అరెస్టులు చేశారు, పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్నిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, విజయవాడలో జరిగిన దగ్గం కార్యక్రమాల్లో సిపిఐ నేత కె.రామకృష్ణ పాల్గొన్నారు. విశాఖపట్నంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య రాజమండ్రిలో, జల్లి విల్సన్ కృష్ణాజిల్లా గుంటుపల్లిలో జి.ఈశ్వరయ్య కడపలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.దేశ రాజధాని ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, జోరు వానను సైతం లెక్కచేయక రైతులు ఆందోళన బాటపట్టి, గత 46 రోజులుగా ఉద్యమిస్తున్నారన్నారు. 45 మంది రైతులు మరణించినా మోడీ మనసు కరగలేదన్నారు. సుప్రీంకోర్టు వేసిన కమిటీలో ఉన్న నలుగురూ కేంద్ర వ్యవసాయ చట్టాలను సమర్ధించిన వారేనని, ఇలాగయితే రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, ఇప్పుడు భారతదేశానికి పట్టుగొమ్మయిన వ్యవసాయ రంగాన్ని అధోగతి పాల్టేసేందుకు మోడీ నల్ల చట్టాల రూపంలో సిద్ధపడ్డారన్నారు. తక్షణమే కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అలాగే కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా కంటక జీవోలను తేవడాన్ని ఖండించారు, ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచే జివోలు 196, 197, 198 తీసుకొచ్చి పట్టణ ప్రాంత ప్రజలపై రు. 30 వేల కోట్ల పెనుభారం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా వ్యతిరేక ఆస్తి పన్ను పెంపుదల జీవోలను రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదన్నారు. లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో భోగి మంటల్లో నల్ల చట్టాలు, జివోల ప్రతులను వేసి దగ్ధం చేసిన సీపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. నూజివీడులో కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకట రామారావు, విజయవాడలో నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.దుర్గాభవాని; గుంటూరులో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, చినకాకానిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవివి ప్రసాద్; కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి.మధు, బొబ్బిలిలలో విజయనగరం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, శ్రీకాకుళంలో జిల్లా కార్యదర్శి ఎస్. న‌ర్సింహులు, వర్సీపట్నంలో విశాఖ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ. ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, పామూరులో ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రెట్టవల్లిలో నెల్లూరు జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్, తిరుపతిలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, అనంతపురంలో జిల్లా కార్యదర్శి డి.జగదీష్, కర్నూాలు జిల్లా పత్తికొండలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, కర్నూలులో రైతు సంఘం నాయకులు జగన్నాథం, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. లెనిన్‌బాబు డోన్‌లో, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యం.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జి. రంగన్న ఎమ్మిగనూరులో పాల్గొన్నారు.

Just In...