Published On: Thu, Feb 11th, 2021

ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు న‌మోదు

అమరావతి, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గడ‌చిన 24 గంటల్లో 26,844 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 70 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగ‌ళ‌వారం బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,555కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,160 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 115 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,80,478కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 917 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,33,94,460 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

Just In...