Published On: Tue, Feb 16th, 2021

సిద్ధార్థ‌ ఎన్‌సీసీ విద్యార్థికి సీఎం న‌గ‌దు ప్రోత్సాహ‌కం

* విద్యార్థి నాగ సురేష్‌ను అభినందించిన క‌ళాశాల యాజ‌మాన్యం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యన్‌సీసీ నేవల్ యూనిట్ లీడింగ్ క్యాడెట్ డి.డి.నాగ సురేష్ జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించి ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ ర్యాలీలో పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్సీసీ శిక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిపబ్లిక్ డే శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ తరఫున ఎన్సీసీ నేవల్ విభాగానికి సంబంధించి కేవలం నాగ సురేష్ మాత్రమే ఎంపిక కావ‌డం తమ కళాశాలకు గర్వకారణమన్నారు. రిపబ్లిక్ డే శిబిరం అనంతరం విజయవాడకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ యన్‌సీసీ క్యాడెట్ల బృందం మర్యాదపూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాగ సురేష్‌ను అభినందించి రూ.2 లక్షలు నగదు పురస్కారాన్ని తక్షణ‌మే అందచేయటం అభినందనీయమని కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి నాగ సురేష్‌ను, ఎన్సీసీ నేవల్ యూనిట్ అసోసియేట్ ఎన్సీసీ అధికారి సబ్ లెఫ్టినెంట్ ఏ.వెంకటేష్‌ను కళాశాల యజమాన్యం తరఫున సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, పి.లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ ఎస్.వెంకటేశ్వరరావు, డీన్ ప్రొఫెసర్ రాజేష్ సి జంపాల, అధ్యాపకులు, విద్యార్ధులు అభినందించారు.

Just In...