నేతపర్వంగా శ్రీవారి చక్రస్నానం…
* విజయకీలాద్రిపై దిగ్విజయంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
తాడేపల్లి(గుంటూరు జిల్లా), సెల్ఐటి న్యూస్: విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న జీయర్ స్వామి, త్రిదండి అహోబిల జీయర్ స్వామి, త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి వార్ల పర్యవేక్షణలో 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నిత్య పుర్ణాహుతి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమంజన సేవ.. అనంతరం సీతానగరం ఘాట్ వద్ద కృష్ణనదిలో చక్ర స్నానం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. వందలాది మంది భక్తులు చక్రసాన్నం కార్యక్రమంలో పాల్గొని నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు ప్రముఖులు విజయకీలాద్రిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుండి ఉత్సవాలు ముగిసేవరకూ విజయకీలాద్రి భక్తుల సందడితో కిటకిటలాడింది. జై శ్రీమన్నారాయణ నినాదంతో మారుమ్రోగింది.