Published On: Mon, Feb 22nd, 2021

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పంచాయితీ ఎన్నికలు

* మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం

* పురపాలక ఎన్నికల్లో పట్టణ ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి

* కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కృష్ణాజిల్లాలో నాలుగు విడతలగా నిర్వహించిన పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో 85 శాతం పోలింగ్‌తో జరిగాయని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పంచాయితీ ఎన్నికలు, రానున్న మున్సిపల్ ఎన్నికలు, కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల `వివరాలను జాయిట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, డిపివో సాయిబాబులతో కలసి కలెక్టర్ ఇంతియాజ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఒక మంచి వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు జరగడం ఆనందానిచ్చిందన్నారు. విజయవాడ డివిజన్‌లో 85.06, గుడివాడలో 84.24, మచిలీపట్నంలో 84.92, నూజివీడులో 85.64 శాతంతో జిల్లాలో నాలుగు విడతలు కలిపి 84. 97 శాతం పోలింగ్ నమోదైందన్నారు. జిల్లాలో పంచాయితీ ఎన్నికల నిర్వహణలో కష్టపడిన ఎన్నికల సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు, డిపివో, డిఆర్డీఏ పిడి, జెడ్పి సిఈవోలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల సమయంలో మీడియ మంచి సహకారం అందించరని వారందరికి కలెక్టర్ ఇంతియాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పట్టణ ఓటర్లు నైతిక విలువలతో కూడిన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంత వాసులు ఓటు వేసేందుకు ఆసక్తి ఎక్కువ చూపరనే భావన ఈ ఎన్నికలతో తొలగాలన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం …
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేపట్టామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెంది గతంలో నామినేషన్ వేసిన వ్యక్తులు మరణించి ఉంటే అటువంటి చోట్ల వారి స్థానంలో వేరే వారు నామినేషన్ వేసే అవకాశాన్ని రాష్ట్రా ఎన్నికల సంఘం కల్పించిందన్నారు.
జిల్లాలో విజయవాడ నగరంలోని 29 వార్డు (టిడిపి), 30 వార్డు (వైఎస్ఆర్ సిపి), మచిలీపట్నంలో 23 వార్డు (వైఎస్ఆర్ సిపి) తిరువూరులో 6 వార్డు (వైఎస్ఆర్ సిపి)లలో అభ్యర్థులు మరణించారన్నారు. వారి స్థానంలో నామినేషన్లను ఈనెల 28వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. 2020 మార్చి 9వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితాను  అనుసరించి మున్సిపల్ ఎన్నికలు జరుతుందన్నారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణలకు మార్చి 3 తేది మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువు ఉందన్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామ‌న్నారు.  మార్చి 10 తేది ఉ. 7 గంటల నుంచి మ. 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. రీ పోలింగ్ అవసరమైతే మార్చి 13వ తేది ఉ. 7 గంటల నుంచి మ. 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 14వ తేదీ ఉ. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 64 డివిజన్లకు, మచిలీపట్నం కార్పొరేషన్లో 50 డివిజన్లకు, నూజివీడు మున్సిపాలిటిలో 32 వార్డులు, పెడనలో 23, నందిగామ, ఉయ్యూరు, తిరువూరులల్లో 20 చొప్పున వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు  124 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు 55 మంది రిటర్నింగ్ అధికారులను, 36 మంది ఎలక్షన్ అధికారులను నియమించమన్నారు. వీరితో పాటు ఏఆర్ వోలను నియమించమని 6070 పోలింగ్ సిబ్బంది అవసరం కాగలదని అంచన వేశామన్నారు. ఇందుకు 5 శాతం అదనంగా ఎన్నికల సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం 119 అత్యంత సమస్యత్మాక, 237 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఎన్నికల నిర్వహణకు 2466 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ (సంక్షేమం), జిల్లా ఎన్నికల అధికారి కె.మోహన్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 24న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 250 మంది ఆర్వోలు, ఈవోలు తదితరులకు శిక్షణ అందిస్తామన్నారు. వియంసి సమావేశ మందిరంలో ఈనెల 22న మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 28న పివోలు, ఏపివోలకు ఆయా నియోజకవర్గ మండల హెడ్ క్వార్టల్లో మొదటి విడత, మార్చి 5న ఆయా మున్సిపాలిటీల్లో రెండవ విడత శిక్షణ ఉంటుందన్నారు. తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో మార్చి 6న ఓట్ల లెక్కింపు శిక్షణ ఉంటుందని, మార్చి 12న ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే మాక్ ఓట్ల లెక్కింపు నిర్వహించబడతుందన్నారు. మార్చి 7న మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఉంటుందన్నారు. వార్డు వారిగా బ్యాలెట్ పత్రాలు ముద్రణ కోసం ఇప్పటికే 5 ప్రింటింగ్ ప్రెస్లు గుర్తించామన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమే:
కోవిడ్ వ్యాక్సిన్ అపోహలు వద్దని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు వద్దని ప్రభుత్వం అనుమతిం చిన మేరకే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొదటి విడత వ్యాక్సిన్ పొందిన హెల్త్ కేర్ వర్కర్లకు రెండవ డోస్ అందిస్తామ‌న్నారు. ఇంతవరకు హెల్త్ కేర్ వర్కర్లకు ఫ్రం ప్లాన్ వర్కర్లు 65 శాతం మంది వ్యాక్సిన్
పొందగా మున్సిపల్ ప్రాంతంలో 33 శాతం పొందరన్నారు. కొంతమంది ఇంకా వ్యాక్సిన్ పొందేందుకు సంశయిస్తూరన్నారు. హెల్త్ కేర్ వర్కర్లు మొదటి డోస్ ఫిబ్రవరి 25 లోపు తీసుకోకపోతే మరల వ్యాక్సిన్ తీసుకునే అవకాశం రాకపోవచ్చన్నారు. కచ్చితంగా హెల్త్ కేర్ వర్కర్లు ముందుకు వచ్చి వ్యాక్సిన్ పొందన్నారు. తాను 55 సం. వయసులో వ్యాక్సిన్ తీసుకున్నాని అయితే తనకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. కరోనా కొంత తగ్గినట్లు కనబడుతున్నా కొన్ని ఇతర దేశాలు రాష్ట్రాల్లో కొత్త రూపంతో ముందుకు
వస్తోందన్నారు. ఈ దృష్ట్యా కరోనా పట్ల నిర్లక్ష్యం మంచిది కాదన్నారు.

 

Just In...