గవర్నర్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
గవర్నర్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
విజయవాడ, సెల్ఐటి న్యూస్: రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ రమేష్‌కుమార్ సోమవారం సాయంత్రం అర్థగంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్‌కు ఆయన వివరించారు. ఎక్కడా ‘ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని తెలిపారు. నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర విషయాలతో కూడిన నివేదికను ఎస్ఈసీ గవర్నర్‌కి నివేదించినట్లు సమాచారం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్ననేపథ్యంలో వాటి నిర్వహణపైనా గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించిన విధానాన్నే మున్సిపల్ ఎన్నికల్లోనూ అనుసరించాలని ఎస్ఈసీ భావిస్తోంది.