Published On: Wed, Feb 24th, 2021

సీఎం జ‌గ‌న్‌ను అభినందించిన మంత్రులు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్ధానాల్లో గెలుపొందడంపై ప‌లువురు రాష్ట్ర మంత్రులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస‌రావులు తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం క‌లిసి పూల‌బొకేలు అంద‌జేసి అభినందించారు.

Just In...