Published On: Fri, Feb 26th, 2021

జాతీయ ర‌హ‌దారిపై ప‌చ్చ‌ద‌నాన్ని సంర‌క్షించాలి

* నేషనల్ హైవే అథారిటీకి ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు కొడాలి సుభాష్ చంద్ర‌బోస్ లేఖ‌

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: నేషనల్ హైవే అథారిటీకి విజయవాడ చిన్న అవుటుప‌ల్లికి చెందిన ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడు కొడాలి సుభాష్ చంద్రబోస్ లేఖ రాశారు. విజయవాడ వారధి నుండి గన్నవరం విమానాశ్రయం మధ్యన ఉన్న గ్రీనరీ మనుగడను కాపాడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గడ‌చిన 30ఏళ్లుగా పచ్చదనం – పరిశుభ్రతపై తాను కృషి చేస్తున్న‌ట్లు వివ‌రించారు. అందులో భాగంగా గత ఎన్‌హెచ్ఐ విజయవాడ ప్రాజక్ట్ డైరెక్టర్ ఛాహల్ నుండి శ్రీధర్, విద్యాసాగర్‌తో స‌మ‌న్వ‌యంతో సత్సంబంధాల‌తో వ్య‌వ‌హ‌రిస్తూ హైవే వెంబడి ముఖ్యంగా విజయవాడ బెంజిసర్కిల్ వద్ద నుండి రామవరప్పాడు వరకు గ్రీన్ బెల్ట్ రెండువైపులా శుభ్రపరచి సుందరీకరించుటకు లక్షలాది రూపాయలు వెచ్చించిన‌ట్లు తెలిపారు. 7 నెలల కాలం పాటు 40 మంది కార్మికుల‌తో చేయించడం జరిగింది. 2001 నుండి 2012 వరకు నేష‌న‌ల్ హైవే అథారిటీ ‌అధికారులు ప్రాంతీయ కమిటీ సలహాదారునిగా నియమించ‌డంతో నెల్లూరు నుండి రాజమండ్రి వరకు హైవే ప్రక్కన గ్రీనరీ అభివృద్ధి కోసం అటవీశాఖతో కలసి పనిచేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో విజయవాడ వారధి నుండి గన్నవరం వరకు 2016 లో హైవే సీఆర్డీఏ వారికి గ్రీనరీ అభివృద్ధి కోసం అప్పగించార‌ని, అనంత‌రం సీఆర్డీఏ‌ను ర‌ద్దు చేయడం వలన కోట్లాది రూపాయిలు వెచ్చించి అభివృద్ధి చేసిన గ్రీనరీ చాలావరకు ప్ర‌స్తుతం నీరు లేక మాడిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వేస‌వి స‌మీపిస్తున్న నేప‌ధ్యంలో హైవే వెంబ‌డి ఉన్న మొక్కలను సంర‌క్షించాల‌ని కోరారు.

Just In...